Gangula Kamalakar: రెండో సారి కరోనా బారిన పడిన టీఎస్ మంత్రి గంగుల

Gangula Kamalakar tests Corona positive for second time

  • స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్న గంగుల
  • పాజిటివ్ రిపోర్ట్ రాగానే ఐసొలేషన్ లోకి వెళ్లిన మంత్రి
  • తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోవాలని కోరిన గంగుల

దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలువురు నేతలు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారిన పడ్డారు. తనలో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్టులు చేయించుకున్నానని... రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చిందని ఆయన తెలిపారు. కరోనా సోకినప్పటికీ, తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరారు. 

మరోవైపు కరోనా పాజిటివ్ అని తెలియగానే గంగుల కమలాకర్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇంకో విషయం ఏమిటంటే గంగుల కమలాకర్ కరోనా బారిన పడటం ఇది రెండో సారి. గత ఏడాది అక్టోబర్ లో ఆయన తొలిసారి కరోనా బారిన పడ్డారు.

Gangula Kamalakar
TRS
Corona Virus
  • Loading...

More Telugu News