Ram: 'ది వారియర్' ఫస్టు డే వసూళ్లు ఇవే!

The Warrior Movie Update

  • రామ్ హీరోగా వచ్చిన 'ది వారియర్'
  • తొలి రోజునే 8.73 కోట్ల షేర్ 
  • వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్ 
  • పోటీగా దగ్గరలో లేని పెద్ద సినిమాలు

రామ్ హీరోగా దర్శకుడు లింగుసామి రూపొందించిన 'ది వారియర్' ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. సినిమా విడుదలకి ముందే పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. మంచి అంచనాల మధ్య ఈ సినిమా థియేటర్ లకు వచ్చింది. 

తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8.73 కోట్ల షేర్ ను వసూలు చేసింది. వచ్చేవారం వరకూ పోటీ ఇచ్చే సినిమా లేకపోవడం వలన, వీకెండ్ లో వసూళ్ల జోరు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ గా రామ్ నటించిన ఈ సినిమాలో, రేడియో జాకీగా కృతి శెట్టి కనిపించింది. తెరపై ఈ జోడీ ఆకట్టుకుంది. 

కథలో కొత్తదనం ఉంది ..  కానీ కథనంలో ఆ కొత్తదనం కనిపించదు. అలాగే రామ్ పాత్రను మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. అదే సమయంలో కృతి పాత్రకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడం కనిపిస్తుంది. ఇలా సినిమా ఓహో అనిపించకపోయినా, పాటల పరంగా చాలావరకూ నెట్టుకొచ్చేసింది..

Ram
Krithi Shetty
Lingusamy
The Warrior movie
  • Loading...

More Telugu News