PV Sindhu: సింగపూర్ ఓపెన్ లో చెలరేగిన పీవీ సింధు.. కవాకమిని చిత్తు చేసి ఫైనల్స్ చేరిన తెలుగుతేజం!

PV Sindhu in Finals

  • సెమీస్ లో జపాన్ షట్లర్ ను చిత్తు చేసిన సింధు
  • 21-15, 21-7 తేడాతో జయకేతనం
  • టైటిల్ కు మరో అడుగు దూరంలో తెలుగుతేజం

సింగపూర్ ఓపెన్ లో భారత టెన్నిస్ దిగ్గజం, తెలుగు తేజం పీపీ సింధు సత్తా చాటింది. జపాన్ షట్లర్ సయేనా కవాకమిని చిత్తు చేసి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. దాదాపు అరగంట పాటు కొనసాగిన మ్యాచ్ లో 21-15, 21-7 తేడాతో సింధు జయకేతనం ఎగురవేసింది. కవాకమిపై సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 

శ్మాష్ షాట్లతో సింధు విరుచుకుపడగా... కవాకమి పొరపాట్లు చేస్తూ ఓటమిపాలయింది.  రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన హాన్ యూను చిత్తు చేసింది. సింగపూర్ ఓపెన్ ను సొంతం చేసుకోవడానికి సింధు మరో అడుగు దూరంలో ఉంది.

PV Sindhu
Singapore Open
Finals
  • Loading...

More Telugu News