Naga Chaitanya: వైజాగ్ లో 'థ్యాంక్యూ' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Thank you movie update

  • విభిన్నమైన కంటెంట్ తో రూపొందిన 'థ్యాంక్యూ'
  • డిఫరెంట్ రోల్ లో కనిపించనున్న చైతూ 
  • కథానాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవిక 
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల 

ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రయాణం లాంటిదే. ఆ ప్రయాణంలో చాలా మంది తారసపడుతుంటారు. వాళ్ల ద్వారా ఎన్నో అనుభవాలు .. అనుభూతులు ..  జ్ఞాపకాలు కలుగుతూ ఉంటాయి. కొందరిని కలవడం వలన జీవితం రంగుల మయంగా కనిపిస్తుంది. మరికొందరి పరిచయం జీవితాన్ని కొత్త కోణంలో చూపిస్తుంది. 

అలాంటి వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పడమనే కంటెంట్ తో విక్రమ్ కుమార్ రూపొందించిన సినిమానే 'థ్యాంక్యూ'. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం వైజాగ్ లో నిర్వహించనున్నారు. 

ఆంధ్ర యూనివర్సిటీ లోని సీఆర్ రెడ్డి కాన్వొకేషన్ హాల్ ఇందుకు వేదికగా మారింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ఈ విషయాన్ని కొంతసేపటి క్రితమే అధికారికంగా వెల్లడించారు.  చైతూ సరసన రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ కథానాయికలుగా అలరించనున్నారు.

Naga Chaitanya
Rashi Khanna
Vikram Kumar
Thank You Movie
  • Loading...

More Telugu News