Vivek Agnihotri: కింగ్ లు, బాద్షాలు, సుల్తాన్ లు ఉన్నంత వరకు బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుంది: 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

Vivek Agnihotri sensational comments on Bollywood stars

  • షారుఖ్, సల్మాన్ లపై వివేక్ పరోక్ష విమర్శలు
  • ప్రజల గాథలతో సినిమాలు తీయాలని సూచన
  • బాలీవుడ్ ను ప్రజల పరిశ్రమగా మార్చాలని వ్యాఖ్య

ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం 'ది కశ్మీర్ ఫైల్స్'. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తాజాగా బాలీవుడ్ స్టార్లను ఉద్దేశించి వివేక్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కింగ్ లు, బాద్షాలు, సుల్తాన్ లు ఉన్నంత వరకు బాలీవుడ్ మునిగిపోతూనే ఉంటుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ప్రజల గాథలతో సినిమాలను తీయాలని, బాలీవుడ్ ను ప్రజల పరిశ్రమగా మార్చాలని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. అప్పుడే బాలీవుడ్ ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను ఉద్దేశించే వివేక్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. వివేక్ చేసిన ఈ ట్వీట్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

Vivek Agnihotri
Bollywood
Stars
The Kashmir Files
  • Loading...

More Telugu News