Vikram Kumar: '24' మూవీ సీక్వెల్ ఆలోచనలో విక్రమ్ కుమార్!

Vikram Kumar Movie Sequel

  • సూర్య హీరోగా వచ్చిన '24'
  • ప్రయోగాత్మక చిత్రంగా ప్రశంసలు 
  • సీక్వెల్ ఉంటుందన్న విక్రమ్ కుమార్ 
  • ఎంతో శ్రమించవలసి ఉంటుందంటూ వ్యాఖ్య   

తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా విక్రమ్ కుమార్ కి మంచి పేరు ఉంది. ఆయన సినిమాలు చాలా విభిన్నంగా .. విలక్షణంగా ఉంటాయి. కథలో కొత్తదనం, పాత్రల్లో వైవిధ్యం ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'థ్యాంక్యూ' .. ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. 

చైతూ - రాశి ఖన్నా జంటగా దిల్ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమా, ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. తాజా ఇంటర్యూలో విక్రమ్ కుమార్ మాట్లాడుతూ '24' సినిమా ప్రస్తావన తెచ్చారు. నిజంగా ఆ సినిమా ఒక ప్రయోగమని, ఆ సినిమాకి సీక్వెల్ చేయమని చాలామంది అడుగుతున్నారని, అందువలన ఆ దిశగా ఆలోచన చేస్తున్నాననీ చెప్పారు. 

"అందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది .. చాలా సమయం పడుతుంది. అయినా సూర్యతోనే సీక్వెల్ చేయాలని భావిస్తున్నాను. అందుకు అన్నీ కుదరాలని  కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన 'దూత' అనే వెబ్ సిరీస్ తో పాటు టాలీవుడ్ లో ఒక సినిమా .. బాలీవుడ్ లో ఒక సినిమా చేయనున్నారు.

Vikram Kumar
Surya
24 Movie Sequel
  • Loading...

More Telugu News