Om Birla: ఏ పదాన్ని కూడా నిషేధించలేదు: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ

We have not banned not a single word says Om Birla

  • జాబితాలో ఉన్నవి గతంలో రికార్డుల నుంచి తొలగించిన పదాలేనన్న స్పీకర్ 
  • అన్ పార్లమెంటరీ పదాల డిక్షనరీని విపక్ష నేతలు చదివారా? అంటూ ప్రశ్న 
  • చదివుంటే దురభిప్రాయాలను ప్రచారం చేసేవారు కాదని వ్యాఖ్య 

పార్లమెంటులో కొన్ని పదాలను నిషేధించిన అంశం రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. విపక్షాలు ఈ నిర్ణయంపై విరుచుకుపడుతున్నాయి. నిషేధించిన పదాలను తాను సభలో వాడతానని... తనను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేసుకోవచ్చని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిస్తూ.. ఏ ఒక్క పదాన్ని కూడా నిషేధించలేదని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తాము విడుదల చేసిన జాబితాలో ఉన్నవి గతంలో రికార్డుల నుంచి తొలగించిన పదాలని చెప్పారు. 

అన్ పార్లమెంటరీ పదాలను గతంలో బుక్ రూపంలో విడుదల చేసేవారని... పేపర్ వేస్ట్ చేయడం ఎందుకని... ఇప్పుడు ఆ పదాలను ఇంటర్నెట్ లో పెట్టామని ఓం బిర్లా తెలిపారు. అన్ పార్లమెంటరీ పదాలతో కూడిన 1,100 పేజీల డిక్షనరీని వాళ్లు (విపక్షాలు) చదివారా? అని ఓం బిర్లా ప్రశ్నించారు. ఒకవేళ చదివున్నట్టయితే ఇలాంటి దురభిప్రాయాలను ప్రచారం చేసేవారు కాదని అన్నారు. 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010లో అభ్యంతరకర పదాలను విడుదల చేశారని... 2010 నుంచి ప్రతి ఏటా విడుదల చేస్తున్నారని చెప్పారు.

Om Birla
Lok Sabha
Unparliamentary words
  • Loading...

More Telugu News