Chiranjeevi: చిరంజీవి కోసం 'మెగా ప్రివ్యూ' వేసిన ఆమిర్ ఖాన్.. స్పెషల్ గెస్టులు వీరే!

Aamir Khan organises a MEGA preview of Chiranjeevi

  • విడుదలకు సిద్ధంగా ఉన్న ఆమిర్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'
  • చిరంజీవి నివాసంలో ప్రివ్యూ వేసిన ఆమిర్
  • హాజరైన నాగార్జున, రాజమౌళి, సుకుమార్, నాగచైతన్య

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ల మధ్య ఉన్న సాన్నిహిత్యం ఈ నాటిది కాదు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. తాజాగా ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ కథానాయికగా నటించగా... అక్కినేని నాగచైతన్య ఒక ప్రత్యేక పాత్రలో నటించాడు. ఆగస్ట్ 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. 

మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆమిర్ ఖాన్, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను ముమ్మరం చేశారు. తాజాగా తన మిత్రుడు చిరంజీవి కోసం 'మెగా ప్రివ్యూ'ను వేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ షో ఇదే కావడం గమనార్హం. హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ వేశారు. ఈ ప్రివ్యూకు ప్రత్యేక అతిథులుగా అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, ప్రముఖ దర్శకులు రాజమౌళి, సుకుమార్ లు హాజరయ్యారు.

Chiranjeevi
Aamir Khan
Nagarjuna
Rajamouli
Naga Chaitanya
Sukumar
Tollywood
Bollywood
Laal Singh Chaddha
  • Loading...

More Telugu News