NGT: పర్యావరణ అనుమతులను ఉల్లంఘించిన హెటిరో... రూ.6.95 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ
- విశాఖ పరిధిలో ఫార్మా సెజ్‌ను ఏర్పాటు చేసిన హెటిరో
- పర్యావరణ అనుమతులను ఉల్లంఘించిందని ఎన్జీటీకి స్థానికుల ఫిర్యాదు
- ఎన్జీటీ ఆదేశాలతో విచారణ చేపట్టిన సంయుక్త కమిటీ
- 311 పేజీలతో నివేదికను అందజేసిన కమిటీ
విశాఖ పరిధిలోని హెటిరో సెజ్‌కు భారీ షాక్ తగిలింది. సెజ్ ఏర్పాటులో పర్యావరణ అనుమతులను ఉల్లంఘించారంటూ హెటిరోకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) రూ.6.95 కోట్ల భారీ జరిమానాను విధించింది. ఈ మేరకు ఎన్జీటీ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో ఫార్మా సెజ్‌ను ఏర్పాటు చేసిన హెటిరో సంస్థ పర్యావరణ అనుమతులను పాటించలేదంటూ స్థానికులు ఎన్జీటీని ఆశ్రయించారు.
ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఎన్జీటీ... దీనిపై విచారణ చేయాలంటూ ఓ సంయుక్త కమిటీని నియమించింది. సదరు కమిటీ సమగ్ర విచారణ చేపట్టి... 311 పేజీల నివేదికను బుధవారం ఎన్జీటీకి అందజేసింది. అంతేకాకుండా పర్యావరణ అనుమతులను ఉల్లంఘించిన హెటిరోకు రూ.6.95 కోట్ల జరిమానాను విధించాలని ఎన్జీటీకి కమిటీ సిఫారసు చేసింది.