Nagarjuna: 'గాడ్ ఫాదర్' దర్శకుడితో నాగ్ 100వ సినిమా!

Nagarjuna in Mohan Raja Movie

  • 'ది ఘోస్ట్' ను రిలీజ్ కి రెడీ చేస్తున్న నాగ్ 
  • హాట్ టాపిక్ గా మారిన ఆయన 100వ సినిమా
  • దర్శకుడిగా మోహన్ రాజాకి ఛాన్స్ అంటూ టాక్ 
  • త్వరలోనే రానున్న క్లారిటీ 

'విక్రమ్' సినిమాతో 1986లో నాగార్జున  తెలుగు తెరకి పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన నట ప్రయాణాన్ని కొనసాగిస్తూ, రొమాంటిక్ హీరోగా తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. తన  50వ సినిమాను .. 75వ సినిమాను నాగార్జున ఎప్పుడూ హైలైట్ చేయలేదు. దాంతో ఆయున 100వ సినిమా ఎప్పుడు? అనేది ఆసక్తికరంగా మారింది. 

'బంగార్రాజు' సినిమా సమయంలోనే 100వ సినిమా ప్రస్తావన వస్తే, ఆ లెక్కల విషయంలో త్వరలోనే క్లారిటీ ఇస్తానని నాగార్జున అన్నారు. కానీ ఇప్పుడేమో ఆయన 100వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి దర్శకుడు మోహన్ రాజా అనే వార్త బలంగా వినిపిస్తోంది. 

ప్రస్తుతం మోహన్ రాజా 'గాడ్ ఫాదర్' సినిమా చేస్తున్నాడు. చిరంజీవి ద్వారానే ఆయన నాగార్జునను కలిసినట్టుగా చెబుతున్నారు. ఆల్రెడీ నాగ్ కథ వినేశారనీ .. కొన్ని మార్పులు చెప్పారని అంటున్నారు. 'ది ఘోస్ట్' తరువాత ఆయన సెట్స్ పైకి వెళ్లేది మోహన్ రాజాతోనేనా? లేదంటే మధ్యలో వేరే సినిమాలేమైనా ఉన్నాయా? అనేది నాగ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Nagarjuna
Mohan Raja Movie
Tollywood
  • Loading...

More Telugu News