Naga Chaitanya: ట్రైలర్ లోనే కథ మొత్తాన్ని కవర్ చేసిన విక్రమ్ కుమార్!

Thank you movie update

  • విలక్షణ దర్శకుడిగా విక్రమ్ కుమార్ కి పేరు 
  • ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'థ్యాంక్యూ'
  • చైతూ సరసన ముగ్గురు కథానాయికలు 
  • ఈ నెల 22వ తేదీన సినిమా విడుదల

విభిన్న కథాచిత్రాల దర్శకుడిగా విక్రమ్ కుమార్ కి మంచి పేరు ఉంది. ఆయన కథలు .. తెరపై వాటిని ఆయన ఆవిష్కరించే తీరు కొత్తగా ఉంటుంది. స్క్రిప్ట్ పై ఎంతో కసరత్తు జరిగిన తరువాత గానీ ఆయన సెట్స్ పైకి వెళ్లరు. అవుట్ పుట్ విషయంలో పూర్తి సంతృప్తి కలిగిన తరువాత గానీ రిలీజ్ కి రెడీ కారు. 

అలాంటి విక్రమ్ కుమార్ నుంచి ఈ నెల 22వ తేదీన రావడానికి 'థ్యాంక్యూ' సినిమా రెడీ అవుతోంది. చైతూ హీరోగా నటించిన ఈ సినిమాలో, కథానాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా సందడి చేయనున్నారు. నిన్న రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 

సినిమా పరంగా చెప్పాలంటే, అనేక అనుభవాలు .. ఆవేదనలు .. అనుభూతులను కలుపుకుంటూ కథానాయకుడు చేసే ప్రయాణమే ఈ కథ. ప్రేమ ..  ఆశ .. ఆశయం .. ఆవేశం  .. ఆవేదన .. వీటన్నిటి కలయికనే జీవితం. అతిథులుగా వచ్చి అనుభవాలను పంచిన ప్రతి ఒక్కరికీ 'థ్యాంక్యూ' చెప్పడమే హీరో ఉద్దేశం. కథ మొత్తాన్ని కవర్ చేస్తూ విక్రమ్ కుమార్ ఈ ట్రైలర్ ను కట్ చేయడం విశేషం.

Naga Chaitanya
Rashi Khanna
Vikram Kumar
Thank You Movie

More Telugu News