Ram: బోయపాటి సినిమాలంటే ఇష్టం: రామ్

Ram Interview

  • రేపు థియేటర్లకు రానున్న 'ది వారియర్'
  • వచ్చే నెల నుంచి బోయపాటితో సెట్స్ పైకి 
  • ఆయనపై భరోసా ఉందంటూ వ్యాఖ్య    

రామ్ హీరోగా రూపొందిన 'ది వారియర్' రేపు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత  ఊపందుకున్నాయి. లింగుసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా కృతి శెట్టి అందాల సందడి చేయనుంది. తాజా ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ, ఈ సినిమా సక్సెస్ పట్ల పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

తన తదుపరి సినిమా బోయపాటితో ఉందనే విషయం తెలిసిందే. ఆ విషయాన్ని గురించి రామ్ ప్రస్తావిస్తూ .. "మొదటి నుంచీ కూడా నాకు బోయపాటి సినిమాలంటే ఇష్టం. ఆయన సినిమాలను నేను తప్పకుండా చూస్తుంటాను. తన కథల్లో మాస్ అంశాలు చేరుస్తూనే ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడం ఎలాగన్నది ఆయనకి బాగా తెలుసు.

నాకు ఆ యన వినిపించిన కథ కూడా అదే తరహాలో ఉంది. ఆయన ట్రీట్మెంట్ పై నాకు బలమైన నమ్మకం ఉంది. అందువల్లనే నా పాన్ ఇండియా సినిమా ఆయనతో ఉండాలని ఆశించాను. అందుకు అన్నీ కుదిరినందుకు చాలా హ్యాపీగా ఉంది. వచ్చేనెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుంది" అని చెప్పాడు.

Ram
Krithi Shetty
Lingusamy
The Warrior Movie
  • Loading...

More Telugu News