Draupadi Murmu: ఏపీ టూర్ ముగించిన ద్రౌపది ముర్ము... ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి ప‌య‌నం

draupadi mirmu wraps up ap tour

  • రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ముర్ము
  • ఏపీ ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ద్ద‌తు కోసం విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన వైనం
  • వీడ్కోలు ప‌లికిన విజ‌యసాయిరెడ్డి, సోము వీర్రాజు

రాష్ట్రప‌తి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌప‌ది ముర్ము మంగ‌ళ‌వారం ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఏపీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధుల మ‌ద్ద‌తు కోసం ఏపీ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ముర్ము... రాష్ట్రంలో అధికార వైసీపీతో పాటు విప‌క్ష టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. అనంత‌రం ఆమె ఏపీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు.

ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ద్రౌప‌ది ముర్ము వెంట కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి విజ‌య‌వాడ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తిరుగు ప్ర‌యాణంలోనూ ఆయ‌న ముర్ము వెంటే ఢిల్లీకి బ‌య‌లుదేరారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి ఢిల్లీ బ‌య‌లుదేరిన ముర్ముకు వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజులు వీడ్కోలు ప‌లికారు.

Draupadi Murmu
Vijayawada
Andhra Pradesh
YSRCP
BJP
TDP
President Of India
President Of India Election
Vijay Sai Reddy
Somu Veerraju
  • Loading...

More Telugu News