Experian: భాగ్య‌న‌గ‌రిలో ఎక్స్‌పీరియ‌న్ గ్లోబ‌ల్‌ ఇన్నోవేష‌న్ సెంట‌ర్‌

ktr inaugurates Experian Global Innovation Centre in hyderabad

  • ఎక్స్‌పీరియ‌న్ సెంట‌ర్‌ను ప్రారంభించిన కేటీఆర్‌
  • డేటా, అన‌లిటిక‌ల్ టూల్స్‌లో మేటి సంస్థ‌గా ఎక్స్‌పీరియ‌న్‌
  • హైద‌రాబాద్‌లో గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ పేరిట ఏర్పాటు

ఇప్ప‌టికే ఐటీ రంగానికి చెందిన మేటి కంపెనీల‌న్నీ హైద‌రాబాద్‌లో త‌మ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌గా... తాజాగా మంగ‌ళ‌వారం ఎక్స్‌పీరియ‌న్ త‌న కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఎక్స్‌పీరియ‌న్ గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛ‌నంగా ప్రారంభించారు.

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ స‌ర్వీసుల రంగంలో ఎక్స్‌పీరియ‌న్ మేటి సంస్థ‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. డేటా, అన‌లిటిక‌ల్ టూల్స్ రంగంలో వినియోగ‌దారుల‌కు మెరుగైన సేవ‌లు అందిస్తున్న సంస్థ‌గా ఎక్స్‌పీరియ‌న్‌కు మంచి పేరుంది. అలాంటి కంపెనీ హైద‌రాబాద్‌లో అడుగుపెట్ట‌డం గ‌మ‌నార్హం.

More Telugu News