Draupadi Murmu: ద్రౌప‌ది ముర్ముకు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన చంద్ర‌బాబు

chandrababu welcomes draupadi murmu at vijayawada

  • ఏపీ టూర్‌కు వ‌చ్చిన ద్రౌప‌ది ముర్ము
  • వైసీపీ నేత‌ల‌తో భేటీ త‌ర్వాత గేట్‌వేకు వ‌చ్చిన ముర్ము
  • పుష్పగుచ్ఛంతో స్వాగ‌తం ప‌లికిన చంద్ర‌బాబు
  • అచ్చెన్నాయుడును ప‌రిచయం చేసిన టీడీపీ అధినేత‌

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న ద్రౌప‌ది ముర్ముకు మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఏపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో భేటీ కోసం మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ వ‌చ్చిన ముర్ము తొలుత సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లి.. ఆపై వైసీపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో భేటీ అయ్యారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆమె వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కోరారు.

అనంత‌రం విజ‌య‌వాడ‌లోని గేట్ వే హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల స‌మావేశానికి ముర్ము హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముర్ముకు పుష్ప గుచ్ఛాన్ని ఇచ్చిన చంద్ర‌బాబు ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడును ఆమెకు ప‌రిచయం చేశారు. అనంత‌రం టీడీపీ ఎమ్మెల్యేలకు ముర్మును ప‌రిచ‌యం చేసిన చంద్ర‌బాబు... రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఆమెకే ఓటేయాల‌ని పిలుపునిచ్చారు.

Draupadi Murmu
Chandrababu
Andhra Pradesh
TDP
President Of India
President Of India Election

More Telugu News