Telangana: బ‌ర్త్ డే నాడు మొక్క‌లు నాటిన కేసీఆర్ మ‌నవ‌డు హిమాన్షు!... ఫొటోలు ఇవిగో!

Himanshu Rao Kalvakuntla plant a sapling on his birth day
  • నేడు హిమాన్షు బ‌ర్త్ డే
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కేటీఆర్ త‌న‌యుడు
  • తాత బాట‌లోనే త‌న‌యుడు అన్న ఎంపీ సంతోష్ కుమార్‌
తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేటీఆర్ త‌న‌యుడు హిమాన్షు రావు బ‌ర్త్ డే సందర్భంగా త‌న కుటుంబానికి చెందిన ఎంపీ జోగినప‌ల్లి సంతోష్ కుమార్‌ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో స్వ‌యంగా ఓ మొక్క‌ను ఆయ‌న నాటారు. ఈ ఫొటోల‌ను ఎంపీ సంతోష్ కుమార్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా హిమాన్షు గురించి సంతోష్ కుమార్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. హిమాన్షు కూడా త‌న తాత కేసీఆర్ బాట‌లోనే న‌డుస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. హ‌రిత హారంతో తెలంగాణ‌ను స‌స్య‌శ్యామలం చేసే దిశ‌గా హ‌రిత హారం ప్రాజెక్టుకు కేసీఆర్ పునాది వేస్తే... తాను కూడా ఆ దిశ‌గానే సాగుతాన‌ని బ‌ర్త్ డే నాడు హిమాన్షు మొక్క నాటార‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... బ‌ర్త్ డే బాయ్ హిమాన్షుకు టీఆర్ఎస్‌కు చెందిన ప‌లువురు నేత‌లు విషెస్ చెబుతున్నారు.
Telangana
Green India Challenge
TRS
KCR
KTR
Himanshu Rao Kalvakuntla

More Telugu News