Nikhil: 'కార్తికేయ 2' నుంచి వీడియో సాంగ్ రిలీజ్!

Karthikeya 2 movie song releasede

  • చందూ మొండేటి నుంచి 'కార్తికేయ 2'
  • నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ 
  • సంగీత దర్శకుడిగా కాలభైరవ 
  • ఆగస్టు మొదటివారంలో విడుదల    

నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఆ  సినిమాకి సీక్వెల్ గా 'కార్తికేయ 2' రూపొందింది. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ .. వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. 

ద్వాపర యుగానికి సంబంధించిన  ఒక రహస్యం చుట్టూ ఈ కథ తిరగనుంది. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి  తాజాగా ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. 'అడిగా నన్ను నేను అడిగా .. నాకెవ్వరూ నువ్వనీ, అడిగా నిన్ను నేను అడిగా నే నిన్నలా లేనని' అంటూ ఈ పాట సాగుతోంది. 

నిఖిల్ - అనుపమ ట్రావెల్ చేస్తుండగా వారిపై చిత్రీకరించిన పాట ఇది. ట్యూన్ బాగానే ఉంది కానీ .. సాహిత్యం హత్తుకోదు .. ఆలాపన ఆకట్టుకోదు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా విడుదల కావలసింది. కానీ ఆగస్టు మొదటివారంలో ఏ సినిమాను విడుదల చేయనున్నట్టు నిఖిల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే

More Telugu News