Nayanatara: 75వ సినిమా కోసం రెడీ అవుతున్న నయనతార!

Nayanatara in Neelesh Krishna movie

  • నయనతార 75వ సినిమాకి సన్నాహాలు 
  • నిర్మాణ సంస్థగా జీ స్టూడియోస్
  • దర్శకుడిగా నీలేశ్ కృష్ణ 
  • కీలకమైన పాత్రలో సత్యరాజ్  

నయనతార ఏ ముహూర్తంలో ఎంట్రీ ఇచ్చిందో కానీ .. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అవకాశాల కోసం ఆమె వెయిట్ చేసిందీ లేదు .. సక్సెస్ ల కోసం తడుముకున్నదీ లేదు. ఒక వైపున స్టార్ హీరోల సరసన నాయికగా నటిస్తూనే, మరో వైపున నాయిక ప్రధానమైన పాత్రలను చేస్తూ వచ్చింది.
 
చాలా వేగంగా కెరియర్ ను పరుగులు తీయించిన కథానాయికల జాబితాలో నయనతార పేరు ముందువరుసలో కనిపిస్తుంది. అలాగే ఆమె స్థాయిలో సక్సెస్ రేటు చూసినవారు కూడా తక్కువే. అలాంటి నయనతార మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి రెడీ అవుతోంది. కెరియర్ పరంగా ఇది ఆమెకి 75వ సినిమా. 

ఈ సినిమాకి జీ స్టూడియోస్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శంకర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన నీలేశ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. జై .. సత్యరాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.

Nayanatara
jai
Sathyaraj
  • Loading...

More Telugu News