Draupadi Murmu: ద్రౌప‌ది ముర్మును చీర సారెతో స‌త్క‌రించిన సీఎం జ‌గ‌న్ దంప‌తులు

ys jagan couple welcomes draupadi murmu

  • ఏపీ టూర్‌లో ద్రౌప‌ది ముర్ము
  • స‌తీస‌మేతంగా ముర్ముకు జ‌గ‌న్ స్వాగ‌తం
  • ముర్ము కారులోనే వైసీపీ ఎమ్మెల్యేల వ‌ద్ద‌కు వెళ్లిన జ‌గ‌న్‌

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో అధికార ఎన్డీఏ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ద్రౌప‌ది ముర్ముకు ఏపీలో ఘ‌న స్వాగ‌తంతో పాటు ఘ‌న స‌త్కారం ల‌భించింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ ఏపీలోని ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను కోరేందుకు ఏపీకి వ‌చ్చిన ముర్ముకు గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో వైసీపీ, బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆమె కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి తాడేప‌ల్లిలోని సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇంటికి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా ముర్ముకు స‌తీస‌మేతంగా సీఎం జ‌గ‌న్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆమెను చీర సారెతో వారు స‌త్క‌రించారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి చిత్ర‌ప‌టాన్ని ఆమెకు అందించారు. అనంత‌రం ముర్ముతో క‌లిసి ఆమె కారులోనే జ‌గ‌న్ వైసీపీ ఎమ్మెల్యేల వ‌ద్ద‌కు వెళ్లారు. వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను స్వ‌యంగా జ‌గ‌న్‌... ముర్ముకు ప‌రిచయం చేశారు.

Draupadi Murmu
President Of India
President Of India Election
Andhra Pradesh
YSRCP
YS Jagan

More Telugu News