Akhil: పవన్ కల్యాణ్ టైటిల్ తో పలకరించనున్న అఖిల్?

Akhil in Venu Sriram Movie

  • 'ఏజెంట్' సినిమాతో రానున్న అఖిల్
  • ఆ తరువాత సినిమా వేణు శ్రీరామ్ తో
  • దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ఇది 
  • అక్కాతమ్ముళ్ల నేపథ్యంలో ఈ కథ నడవనుంది  

పవన్ కల్యాణ్ కి మాత్రమే కాదు .. ఆయన సినిమా టైటిల్స్ కి కూడా ఒక ఇమేజ్ .. ఒక క్రేజ్ ఉంటాయి. ఆ సినిమా టైటిల్స్ ను వాడటం వలన ఆ టైటిల్ వెంటనే జనంలోకి వెళుతుందనీ .. వెంటనే రిజిస్టర్ అవుతుందని భావిస్తుంటారు. టైటిల్ నుంచే ఆ సినిమా గురించి అంతా మాట్లాడుకోవడం మొదలుపెడతారు. 

పవన్ టైటిల్ 'తొలిప్రేమ'తో వరుణ్ తేజ్ హిట్ కొట్టాడు. పవన్ టైటిల్ 'ఖుషి'తో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు. ఇక అక్కినేని వారసుడు అఖిల్ కూడా పవన్ టైటిల్ తోనే తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది .. అదే 'తమ్ముడు' టైటిల్. 'వకీల్ సాబ్' డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.  

 పవన్ హీరోగా 1999లో వచ్చిన 'తమ్ముడు' ఆయన కెరియర్ లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో వేణు శ్రీరామ్ రూపొందిస్తున్న ఈ సినిమాకి ఈ టైటిల్ ను సెట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అఖిల్ తాజా చిత్రమైన 'ఏజెంట్' రిలీజ్ తరువాత ఈ సినిమా పట్టాలెక్కనున్నట్టు సమాచారం.

Akhil
Venu Sriram
Thammudu Movie
  • Loading...

More Telugu News