Danish Kaneria: కోహ్లీ ఫామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ స్పిన్నర్ కనేరియా

 Former Pakistani Cricketer Danish Kaneria Slams Virat Kohli

  • కోహ్లీ జట్టుకు భారంగా మారాడన్న కనేరియా
  • అతడి స్థానాన్ని మరొకరికి ఇవ్వాలని సూచన
  • అలా కాకుంటే కోహ్లీనే కొన్ని రోజులు జట్టుకు దూరంగా ఉండాలన్న మాజీ స్పిన్నర్

తరచూ విఫలమవుతూ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు చేశాడు. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ జట్టుకు భారంగా మారాడని అన్నాడు. జట్టులో సీనియర్లు లేకున్నా యువకులే గెలిపిస్తున్నారని, కాబట్టి కోహ్లీ స్థానాన్ని మరొకరికి ఇవ్వాలని సూచించాడు. అలా కాని పక్షంలో ఆటకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని, ప్రపంచ కప్ ముందు జట్టులో చేరాలని కోహ్లీకి సూచించాడు. 

కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు చెబుతున్నారన్న కనేరియా.. అతడు ఐపీఎల్‌లో ఆడకుండా విశ్రాంతి తీసుకుని ఉంటే బాగుండేదని, తాను మొదటి నుంచీ ఇదే విషయం చెబుతున్నానని పేర్కొన్నాడు. భారత జట్టు ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతుంటే కోహ్లీ మాత్రం జట్టుకు భారంగా పరిణమించాడని విమర్శించాడు.

కాగా, కోహ్లీ ఫామ్‌పై ఇటీవల దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకప్పుడు బాగా ఆడాడన్న ఉద్దేశంతో ఇప్పుడు జట్టులో కొనసాగించడం సరికాదని, అతడిని బెంచ్‌కు పరిమితం చేయాలని సూచించాడు. టెస్టుల్లో ప్రపంచ నంబర్ 1 అయిన రవిచంద్రన్ అశ్విన్‌నే పక్కనపెట్టినప్పుడు అతడిని ఎందుకు పక్కన పెట్టలేరని ప్రశ్నించాడు. కోహ్లీని ఇంకెంత కాలం మోస్తారని ఘాటు విమర్శలు చేశాడు.

  • Loading...

More Telugu News