Gujarat: భారీ వర్షాల వేళ గుజరాత్ సీఎంతో మాట్లాడిన అమిత్ షా
- గుజరాత్‌లో పోటెత్తిన వరదలు
- ఇప్పటికే 50 మంది చనిపోయినట్లు వార్తలు
- గుజరాత్‌కు అండగా ఉంటామని అమిత్ షా ప్రకటన
దేశంలోని చాలా రాష్ట్రాల్లో గడచిన రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. చాలా ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ వరదలు ముంచెత్తాయి. వరదల తాకిడికి ఇప్పటికే ఆ రాష్ట్రంలో 50 మంది దాకా గల్లంతు అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేశారు. గుజరాత్‌లోని వరద పరిస్థితులపై ఆరా తీశారు. వరదల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని సీఎంకు అమిత్ షా భరోసా ఇచ్చారు.