Sai Pallavi: నేను లవ్ లెటర్ రాశాను .. కానీ అలా జరుగుతుందని అనుకోలేదు: సాయిపల్లవి

Sai Pallavi Interview

  • సహజనటిగా మెప్పిస్తున్న సాయిపల్లవి 
  • స్కూల్ డేస్ విషయాలను ప్రస్తావించిన తీరు
  • సెవెంత్ క్లాస్ లోనే లవ్ లెటర్ రాశానంటూ వెల్లడి 
  • పేరెంట్స్ తో తన్నులు తిన్నానంటూ నవ్వులు

సహజమైన అభినయానికి సాయిపల్లవి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తుంది. అందువల్లనే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెను ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. ఇటీవల వచ్చిన 'విరాటపర్వం' సినిమాతో నటన పరంగా ఆమె మరిన్ని మార్కులు సంపాదించుకుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించింది.

నేను 'విరాటపర్వం' సినిమాలో హీరో భావాలు నచ్చి .. ఆయన విప్లవాత్మక కవితలు నచ్చి లెటర్స్ రాస్తాను. ఈ సందర్భంగా, నిజ జీవితంలో నేను ప్రేమలేఖ రాయడం గుర్తొచ్చింది. కాలేజ్ రోజుల్లో కాదు లెండీ .. సెవెంత్ క్లాస్ లో. అప్పుడు నేను ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. కాకపోతే అది మా పేరెంట్స్ కి తెలుస్తుందని నేను అనుకోలేదు. 

నేను లవ్ లెటర్ రాసిన విషయం వాళ్లకి తెలిసిపోయింది .. అడ్డంగా దొరికిపోవడంతో ఇద్దరూ కలిసి బాగా కొట్టారు. ఆ రోజును నేను ఇప్పటికీ మరిచిపోలేదు' అంటూ సాయిపల్లవి నవ్వేసింది. ఆమె తాజా చిత్రమైన 'గార్గి' తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.

Sai Pallavi
Gargi Movie
Kollywood
  • Loading...

More Telugu News