Hyper Aadi: ఒక సినిమా చేస్తే వచ్చే ఆదాయాన్ని పవన్ కల్యాణ్ కౌలు రైతులకు సాయం చేయడానికి ఉపయోగిస్తున్నారు: హైపర్ ఆది

Hyper Aadi heaps praise ion Pawan Kalyan

  • పవన్ కు చిత్రపరిశ్రమలోనూ ఎందరో అభిమానులు
  • వారిలో హైపర్ ఆది ఒకరు
  • ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ
  • పవన్ వ్యక్తిత్వంపై ప్రశంసలు

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అనేకమంది అభిమానులు ఉన్నారు. వారిలో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. అలాంటివారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హైపర్ ఆది, ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. 

తాజాగా ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ, పవర్ స్టార్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. డబ్బు దోచుకుని విలాసవంతంగా బతుకుదామన్న ఆశ ఆయనకు లేదని హైపర్ ఆది అన్నారు. ఈ రోజుల్లో ఎలాంటి వాళ్లయినా డబ్బుకు దాసోహం అనాల్సిందేనని, కానీ పవన్ కల్యాణ్ అందుకు అతీతమైన వ్యక్తి అని కొనియాడారు. 

ఒక సినిమా చేస్తే వచ్చే ఆదాయాన్ని కౌలు రైతులకు సాయం చేయడానికి వినియోగిస్తున్నారని ఆది వెల్లడించారు. "ఒక సినిమాతో 50 కోట్లు వచ్చాయనుకుంటే, పేదలకు, పార్టీ కోసం పనిచేసే వారికి పంచేస్తారు... అదీ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వానికి నేను అభిమానిని... ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటా" అంటూ హైపర్ ఆది వ్యాఖ్యానించారు.

Hyper Aadi
Pawan Kalyan
Power Star
Janasena
Tollywood
  • Loading...

More Telugu News