Naneghat: జలపాతం కింద పడకుండానే ఆవిరిగా మారిపోతే!... అలాంటి ప్రకృతి సోయగం వీడియో ఇదిగో!
- పశ్చిమ కనుమల్లోని నానేఘాట్లో అరుదైన దృశ్యం
- జల ధార మధ్యలోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళుతున్న వైనం
- వీడియోను పంచుకున్న ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నంద
ప్రకృతిలో ఎన్నెన్నో అందాలు కనిపిస్తుంటాయి. వాటిలో కమనీయ దృశ్యాలు మరెన్నో. అలాంటి ఓ దృశ్యాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు చెందిన అధికారి సుశాంత నంద సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో కొండపై నుంచి జాలువారే జలపాతం భూమిని తగలకుండానే... మధ్యలోనే ఆవిరిగా మారిపోతున్న వైనం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది.
పశ్చిమ కనుమల్లోని నానేఘాట్ ప్రాంతంలో కనిపించిన ఈ దృశ్యంలో కొండ పై నుంచి కిందకు జారుతున్న జల ధార అలా మధ్యలోనే ఆవిరిగా మారిపోతూ పైకి వెళుతోంది. వాయువేగం అన్నది భూమి గురుత్వాకర్షణ శక్తికి సరిసమానంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఉన్నప్పుడు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని సుశాంత నంద వెల్లడించారు.