Ram: త్వరలోనే రామ్ తో నా సినిమా ఉంటుంది: హరీశ్ శంకర్

The Warrior Movie Update

  • మాస్ డైరెక్టర్ గా సక్సెస్ అయిన హరీశ్ శంకర్
  • 'దేవదాసు' నుంచి రామ్ ఫ్యాన్ నంటూ వ్యాఖ్య 
  • ఆయనతో సినిమా చేయడం కుదరలేదంటూ వివరణ 
  • త్వరలోనే తమ కాంబో ఉంటుందంటూ స్పష్టీకరణ  

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో హరీశ్ శంకర్ ఒకరిగా కనిపిస్తాడు. తన సినిమాలకు కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను ఆయనే సమకూర్చుకుంటాడు. త్వరలో ఆయన పవన్ కల్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో త్వరలోనే రామ్ తో తన సినిమా ఉంటుందని ఆయన ప్రకటించడం విశేషం. నిన్న రాత్రి జరిగిన 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ అందుకు వేదికగా మారింది. ఈ వేదికపై హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. రాపో (రామ్ పోతినేని) లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏమిటంటే అందరితో మంచి ర్యాపో మెయింటేన్ చేస్తాడని చమత్కరించారు. 

''దేవదాసు నుంచి నేను రామ్ ఫ్యాన్ ని. ఆయన హీరోగా సినిమా చేయడానికి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ, కొన్ని కారణాల వలన కుదరలేదు. ఆయన ఒక హీరోగా కాకుండా ఒక ప్రేక్షకుడిగా కథను వినడం నాకు నచ్చుతుంది. రామ్ తో తప్పకుండా సినిమా చేస్తాను. అది ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు చెప్పలేను" అంటూ ముగించాడు.

Ram
Krithi Shetty
harish Shankar
The Warrior Movie
  • Loading...

More Telugu News