Suchendra Prasad: మీడియా ముందుకు వచ్చిన పవిత్రా లోకేశ్ మాజీ భర్త

Pavitra Lokesh ex husband Suchendra Prasad talks to media
  • మీడియాలో నరేశ్, పవిత్రా లోకేశ్ బంధంపై కథనాలు
  • చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించిన నరేశ్ భార్య
  • పవిత్రకు రిలేషన్స్ అలవాటేనన్న మాజీ భర్త
  • తమకు పెళ్లే కాలేదన్న పవిత్ర
  • ఆధారాలు ఉన్నాయన్న మాజీ భర్త
ఇటీవల మీడియాలో టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్రలపై పలు కథనాలు రావడం తెలిసిందే. నరేశ్, పవిత్ర బెంగళూరులో ఓ హోటల్ గదిలో ఉండగా, నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి చెప్పుతో కొట్టేందుకు యత్నించారు. ఈ వ్యవహారాలపై పవిత్ర లోకేశ్ మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానిస్తూ, పవిత్రకు ఇటువంటి సంబంధాలు కొత్తేం కాదని అన్నారు. పవిత్ర స్పందిస్తూ, సుచేంద్ర ప్రసాద్ తో తనకు పెళ్లి కాలేదని తెలిపారు. 

ఈ నేపథ్యంలో, సుచేంద్ర ప్రసాద్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తమది ప్రేమపెళ్లి అని వెల్లడించారు. అయితే, ఉద్దేశపూర్వకంగానే మ్యారేజి సర్టిఫికెట్ తీసుకోలేదని తెలిపారు. మ్యారేజి సర్టిఫికెట్ విదేశీ విధానం అని, అందుకు తాము వ్యతిరేకం అని వివరించారు. కానీ, ఆధార్ కార్డు, పాస్ పోర్టును పరిశీలిస్తే పవిత్ర తన భార్యే అని స్పష్టమవుతుందని వివరించారు. తామిద్దరం భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు హాజరయ్యామని కూడా సుచేంద్ర చెప్పారు.
Suchendra Prasad
Pavitra Lokesh
Naresh
Marriage

More Telugu News