Team India: రెండో టీ20 మ్యాచ్ లోనూ టీమిండియానే విన్నర్... 2-0తో సిరీస్ కైవసం

Team India clinch series after won second T20
  • మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు
  • 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌటైన ఇంగ్లండ్
  • 49 పరుగులకే టీమిండియా జయభేరి
  • భువనేశ్వర్ కు 3 వికెట్లు
ఇటీవల ఇంగ్లండ్ తో రీషెడ్యూల్డ్ టెస్టులో పరాజయం పాలైన టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 49 పరుగుల ఆధిక్యంతో ఆతిథ్య జట్టును ఓడించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 17 ఓవర్లలో 121 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటారు. భువనేశ్వర్ కుమార్ 3, బుమ్రా 2, చహల్ 2, హార్దిక్ పాండ్యా 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ 35, డేవిడ్ విల్లీ 33 పరుగులు చేశారు. 

ఈ విజయంతో భారత్ టీ20 సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. రేపు (జులై 10) ట్రెంట్ బ్రిడ్జ్ లో ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టీమిండియా ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకోవడంతో, ఈ మ్యాచ్ కు ఏమంత ప్రాధాన్యత లేకుండా పోయింది.
Team India
T20 Series
2nd T20
England

More Telugu News