Etela Rajender: వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తా: ఈటల రాజేందర్

Will contest on KCR says Etela Rajender

  • వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానన్న ఈటల 
  • ఇప్పటికే గజ్వేల్ లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని వెల్లడి 
  • బెంగాల్ మాదిరి ఇక్కడ కూడా సీఎంను ఓడించాలని పిలుపు 

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని, కేసీఆర్ ను ఢీకొంటానని చెప్పారు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి ముందే చెప్పానని తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నానని అన్నారు. కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. పశ్చిమబెంగాల్ సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందని అన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ నేత సువేందు అధికారి ఓడించారని... పశ్చిమబెంగాల్ మాదిరే ఇక్కడ కూడా ముఖ్యమంత్రిని ఓడించాలని చెప్పారు.

Etela Rajender
BJP
KCR
TRS
Mamata Banerjee
Gajwel
  • Loading...

More Telugu News