Vikram: మణిరత్నం కోసం రంగంలోకి కమల్!

Ponniyan Selven Movie Update

  • మణిరత్నం తాజా చిత్రంగా రూపొందిన 'పొన్నియన్ సెల్వన్'
  • రాజ రాజ చోళ నేపథ్యంలో నడిచే కథ 
  • తమిళ వెర్షన్ కి కమల్ వాయిస్ ఓవర్ 
  • సెప్టెంబర్ 30వ తేదీన విడుదల  

కమల్ 'విక్రమ్' సినిమాతో మరోసారి తన విశ్వరూపం చూపించారు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమా ఆయన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి కమల్ 'పొన్నియన్ సెల్వన్' కి వాయిస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మణిరత్నం దర్శకత్వంలో .. లైకా నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమైంది. 

తమిళంతో పాటు తెలుగు .. కన్నడ .. మలయాళ  .. హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి అనేక విశేషాలు జోడిస్తూ ఉండటంతో, అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో అక్కడక్కడా సన్నివేశాలను కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట. 

ప్రతి భాష నుంచి ఒక స్టార్ ను ఎంచుకుని ఆ వాయిస్ ఓవర్ ను చెప్పించాలనే నిర్ణయానికి వచ్చిన మణిరత్నం, తమిళంలో కమల్ చెబితే బాగుటుందని భావించినట్టుగా సమాచారం. 'నాయకన్' నుంచి కమల్ ..  మణిరత్నం మధ్య మంచి  అనుబంధం ఉంది. అందువలన మణిరత్నం అడిగిన వెంటనే కమల్ ఓకే చెప్పారని అంటున్నారు.

Vikram
Aishwarya Rai
Manirathnam
Ponniyan Selven Movie
  • Loading...

More Telugu News