Sensex: తగ్గుతున్న ముడిచమురు ధరలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 303 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 88 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4.72 శాతం పెరిగిన ఎల్ అండ్ టీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. కమోడిటీ ధరలు, ముడిచమురు ధరలు తగ్గడంతో పాటు... చైనా ఆర్థిక వ్యవస్థ ఆంక్షల నుంచి బయటపడటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303 పాయింట్లు లాభపడి 54,481కి చేరుకుంది. నిఫ్టీ 88 పాయింట్లు పెరిగి 16,221 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (4.72%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.94%), ఎన్టీపీసీ (2.21%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.85%), యాక్సిస్ బ్యాంక్ (1.62%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-1.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.47%), మారుతి (-1.44%), టీసీఎస్ (-0.67%), ఏసియన్ పెయింట్స్ (-0.36%).