hemant soren: ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ సోదాలు

ED raids in CM Hemant Soren house

  • సోరెన్ తో పాటు సన్నిహితుల ఇళ్లలో సోదాలు
  • 18 ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి సోదాలు
  • పారా మిలిటరీ బలగాల సాయాన్ని తీసుకున్న ఈడీ అధికారులు

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. టెండర్ కుంభకోణం వ్యవహారంలో హేమంత్ సోరెన్ తో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు జరుపుతున్నారు. రాజ్ మహల్, మీర్జా చౌక్, సాహెబ్ గంజ్, మెర్హత్ తదితర 18 ప్రాంతాల్లో ఈ తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు సోదాల సమయంలో పారా మిలిటరీ బలగాల సాయాన్ని ఈడీ అధికారులు తీసుకున్నారు.

hemant soren
ED
Enforcement Directorate
Raids
  • Loading...

More Telugu News