Revanth Reddy: ఆ రోజే... వైఎస్ కు నిజమైన నివాళి: రేవంత్ రెడ్డి

Revanth Reddy pays tributes to late YSR

  • నేడు వైఎస్ 73వ జయంతి
  • హైదరాబాదులో వైఎస్ విగ్రహానికి రేవంత్ నివాళులు
  • పేదవాడి గుండెల్లో సంక్షేమ సంతకం వైఎస్ అన్న రేవంత్
  • రాహుల్ ను ప్రధానిగా చూడాలనుకున్నారని వెల్లడి

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ ఇవాళ హైదరాబాదులో వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అంతకుముందు గాంధీ భవన్ లో వైఎస్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటు భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, విజయారెడ్డి తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. 

అనంతరం రేవంత్ ట్విట్టర్ లో తన మనోభావాలను పంచుకున్నారు. ప్రాంతాలకు అతీతంగా పేదవాడి గుండెల్లో సంక్షేమ సంతకం వైఎస్సార్ అని అభివర్ణించారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ ఉన్నతి కోసం తప్పించిన నేత ఆయన అని కీర్తించారు. రాహుల్ గాంధీని ఈ దేశ ప్రధానిగా చూడాలన్నది వైఎస్ ఆశయం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఆయన అభిమానులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ ఆశయం సిద్ధించిన రోజే ఆయనకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

Revanth Reddy
YSR
Tributes
Hyderabad
Rahul Gandhi
Congress
Telangana
  • Loading...

More Telugu News