Eknath Shinde: భారీ వర్షాలు.. వరదనీటిలో చిక్కుకుపోయిన మహారాష్ట్ర సీఎం షిండే నివాసం!
![CM Eknath Shinde residence surrounded by flood water](https://imgd.ap7am.com/thumbnail/cr-20220707tn62c6bc3a168aa.jpg)
- మహారాష్ట్రను ముంచెత్తుతున్న వర్షాలు
- ముంబై, థానే ప్రాంతాల్లో కుంభవృష్టి
- ఏక్ నాథ్ షిండే నివాసం చుట్టూ చేరిన వరదనీరు
మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని ముంబై సహా థానే, పాల్ఘర్ తదితర జిల్లాలు కుంభవృష్టి వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో థానేలోని సీఎం ఏక్ నాథ్ షిండే నివాసం వరదనీటిలో చిక్కుకుపోయింది. నివాసం చుట్టూ వరదనీరు చేరింది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ టీమ్ అక్కడకు చేరుకుని వరదనీటిని తొలగించింది.