: విజయవాడ టీడీపీ టికెట్ రాజకీయాలు
టీడీపీ ఎంపీ హరికృష్ణ ను ఆ పార్టీ నేతలు దేవినేని ఉమ, గద్దే రామ్మోహన రావు విజయవాడలో కలుసుకున్నారు. పీఆర్పీ నుంచి కేశినేని నాని టీడీపీలో చేరడంతో గత కొద్ది రోజులుగా విజయవాడ టీడీపీ టికెట్టుపై విభేదాలు రాజుకున్నాయి. దీంతో గత వారం ఎంపీ సీటు కేటాయిస్తే తానూ డబ్బులు ఖర్చుపెడతానంటూ గద్దే కరపత్రాలు కూడా కొట్టించారు. అయితే, హైకమాండ్ ఆదేశంతో అవి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. తాజాగా గద్దే, హరికృష్ణ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సీటు విషయంలో గద్దే తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.