Nayanthara: పసుపుతాడుతో ముంబై ఎయిర్ పోర్టులో నయనతార.. వీడియో ఇదిగో!

Nayanathara spotted in Mumbai airport with Mangalasutra

  • ప్రియుడు విఘ్నేశ్ శివన్ ను పెళ్లాడిన నయనతార
  • ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న జంట
  • చిన్న ట్రిప్ కోసం చెన్నై నుంచి ముంబై వచ్చిన నయన్

దక్షిణాది అగ్ర సినీ కథానాయిక నయనతార ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తమిళ సినీ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న నయన్... ఆయనను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా నయన్ జోరు కానీ, ఆమె క్రేజ్ కానీ ఏమాత్రం తగ్గలేదు. 

తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో ఆమె కెమెరా కంటికి చిక్కింది. ఒక షార్ట్ ట్రిప్ కోసం ఆమె చెన్నై నుంచి ముంబైకి వచ్చింది. బ్లాక్ ఔట్ ఫిట్ లో ఎంతో గ్లామరస్ గా కనిపిస్తున్న నయన్ మెడలో ఉన్న మంగళసూత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాస్క్ ధరించి, ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పాపరాజ్జీలు క్యాచ్ చేశారు. ఎయిర్ పోర్టు వెలుపలికి వచ్చిన నయన్... కారెక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Nayanthara
Mumbai
Airport
Tollywood
Bollywood

More Telugu News