Kuwait: 10 రోజుల్లోనే వర్క్ వీసా ఇస్తున్న కువైట్

Kuwait offering work permit in 10 days

  • వర్క్ పర్మిట్ కు కనీసం 3 నెలలు పడుతున్న సమయం
  • మెడికల్ పరీక్షలకు 4 రోజులు పడుతున్న వైనం
  • ఈ సమయాన్ని తగ్గించేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చిన కువైట్

విదేశాల నుంచి ఉపాధి నిమిత్తం వచ్చే ప్రవాస భారతీయులకు కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ ప్రక్రియను వేగవంతం చేసింది. కేవలం 10 రోజుల్లోనే వర్క్ పర్మిట్ జారీ అయ్యేలా నూతన విధానాన్ని తీసుకొచ్చింది. గతంలో వర్క్ పర్మిట్ కోసం కనీసం 3 నెలలు వేచి చూడాల్సి ఉండేది. 

ప్రస్తుతం మెడికల్ పరీక్షల కోసం 4 రోజుల సమయం పడుతోంది. వీటిలో స్వదేశంలో 2 రోజులు, కువైట్ కు వచ్చిన తర్వాత మరో 2 రోజుల సమయం పట్టేది. వైద్య పరీక్షల ఫలితాలను పొందడానికి ఒక నెల పట్టేది. కొత్త విధానం వల్ల ఈ సమయం పూర్తిగా తగ్గిపోనుంది. అయితే కొత్త విధానంలో ఛార్జీలు గతంలో కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి.

Kuwait
Visa
Work Permit
10 Days
  • Loading...

More Telugu News