Anna Canteen: జ‌గ్గ‌య్య‌పేట‌లో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని

kesineni nani itnaugurates anna canteen in jaggayyapet

  • టీడీపీ హ‌యాంలో ప్రారంభ‌మైన అన్న క్యాంటీన్లు
  • వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక అన్న క్యాంటీన్ల‌కు మూత‌
  • టీడీపీ నేత‌లే స్వ‌యంగా సొంత ఖ‌ర్చుల‌తో ఏర్పాటు చేస్తున్న వైనం

ఏపీలో టీడీపీ పాల‌న‌లో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూత ప‌డిన సంగ‌తి తెలిసిందే. పేద‌ల‌కు అతి త‌క్కువ ధ‌ర‌కే భోజ‌నాన్ని అందించేందుకు ఉద్దేశించిన అన్న క్యాంటీన్ల మూత‌పై టీడీపీ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. అంతేకాకుండా ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ నేత‌లే ప్రైవేట్‌గా త‌మ సొంత ఖ‌ర్చుల‌తోనే అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం ఎన్టీఆర్‌ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లో అన్న క్యాంటీన్‌ను టీడీపీ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు.

ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్ (శ్రీరాం తాతయ్య), తంగిరాల సౌమ్య త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన త‌ర్వాత తొలి రోజు పేద‌ల‌కు టీడీపీ నేత‌లు భోజ‌నం పంపిణీ చేశారు.

Anna Canteen
TDP
Kesineni Nani
NTR District
Jaggayyapet

More Telugu News