Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 327 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 83 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతానికి పైగా లాభపడ్డ హిందుస్థాన్ యూనిలీవర్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఒడిదుడుకులకు గురయ్యాయి. అనంతరం కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. చమురు ధరలు కొంత మేర దిగిరావడం మార్కెట్లకు కలిసొచ్చింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 327 పాయింట్లు లాభపడి 53,234కి చేరుకుంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 15,835 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (4.03%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.95%), ఐటీసీ (2.62%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.15%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.46%), టాటా స్టీల్ (-2.15%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.56%), డాక్టర్ రెడ్డీస్ (-1.12%), టెక్ మహీంద్రా (-1.01%).

  • Loading...

More Telugu News