YSRCP: అల్లూరి ఘ‌న‌త‌కు గుర్తింపుగానే ఆయ‌న పేరిట ఓ జిల్లా ఏర్పాటు: ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌

ap cm ys jagan praises alluri seetharama raju
  • పోరాట యోధుల్లో అల్లూరి మ‌హా అగ్ని క‌ణమ‌న్న జ‌గ‌న్‌
  • తెలుగు జాతి, భార‌త జాతికి అల్లూరి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని వెల్ల‌డి
  • అల్లూరి పేరిట వేడుక‌లు సంతోష‌క‌ర‌మ‌న్న ఏపీ సీఎం
మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు ఘ‌న‌త‌ను గుర్తించుకుని ఆయ‌న పేరిట ఓ జిల్లాను ఏర్పాటు చేశామ‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. పోరాట యోధుల్లో అల్లూరి మ‌హా అగ్ని క‌ణ‌మ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. సోమవారం భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిల‌తో క‌లిసి జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అల్లూరి పోరాట స్ఫూర్తిని జ‌గ‌న్ కీర్తించారు. 

ల‌క్ష‌లాది మంది త్యాగ ఫ‌ల‌మే నేటి భార‌త దేశ‌మ‌ని జ‌గ‌న్ అన్నారు. అల్లూరి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ప్ర‌త్యేకంగా వేడుక‌లు నిర్వ‌హించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని ఆయ‌న పేర్నొన్నారు. అల్లూరి తెలుగు జాతికే కాకుండా భార‌త జాతికి కూడా గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పారు. అల్లూరి త్యాగం ప్ర‌తి మ‌నిషి గుండెలో చిర‌కాలం నిలిచిపోతుంద‌ని జ‌గ‌న్ తెలిపారు.
YSRCP
YS Jagan
Alluri Seetharama Raju
Bhimavaram
Prime Minister
Narendra Modi
BJP

More Telugu News