Tollywood: ‘అల్లూరి’ పేరుతో వస్తున్న యువ హీరో శ్రీవిష్ణు

Sree Vishnu new movie Alluri Teaser launch

  • 'అల్లూరి'లో పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు 
  • ప్రదీప్ వర్మ దర్శకత్వంలో సినిమా 
  • అల్లూరి 125వ జయంతి సందర్భంగా టీజర్ విడుదల

విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న యువ నటుడు శ్రీవిష్ణు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘అల్లూరి’. సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది.  


ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు  పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 81 సెకన్ల ఈ టీజర్ లో పోలీస్ డ్రెస్ లో శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు. విప్లవానికి నాంది చైతన్యం.. చైతన్యానికి పునాది నిజాయతీ..నిజాయతీకి మారుపేరు అల్లూరి అనే డైలాగ్స్ బాగున్నాయి. ఈ చిత్రానికి ‘నిజాయితీకి మారుపేరు’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు. అందుకు తగ్గట్గుగా హీరో పాత్రను మలచినట్టు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. 

    కాగా, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఈ సినిమా చేయడం సంతోషంగా ఉందని సినిమా యూనిట్ తెలిపింది. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అల్లూరి 125వ జయంతి రోజున తన చిత్రం టీజర్ రిలీజ్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నాడు. తాను అల్లూరిని చూడకపోయినా.. ఆయన పేరు పెట్టుకున్న ఈ సినిమాలో నిజాయితీగా నటించానని చెప్పాడు. కెరీర్ లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉందన్నాడు. 
.

Tollywood
sri vshnu
new movie
alluri
teaser
  • Loading...

More Telugu News