Telangana: తెలంగాణలో కొత్తగా 457 మందికి కొవిడ్ పాజిటివ్

Telangana Covid cases details

  • గత 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు
  • హైదరాబాదులో 285 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 494 మంది
  • ఇంకా 4,747 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,384 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, 457 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. హైదరాబాదులో అత్యధికంగా 285 కొత్త కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 35, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27, రంగారెడ్డి జిల్లాలో 25 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 494 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటిదాకా 8,02,379 మంది కరోనా బారినపడగా, వారిలో 7,93,521 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,747 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మరణించారు.

Telangana
COVID19
New Cases
Update
  • Loading...

More Telugu News