Jonny Bairstow: టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు: సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్ స్టో

Jonny Bairstow hits ton against Team India

  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • 119 బంతుల్లో సెంచరీ కొట్టిన బెయిర్ స్టో
  • తగ్గుతున్న పరుగుల తేడా
  • ఇంగ్లండ్ స్కోరు 6 వికెట్లకు 235 రన్స్

టీమిండియాతో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో బరిలో దిగిన బెయిర్ స్టో 119 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో బెయిర్ స్టో 14 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. ఇటీవల న్యూజిలాండ్ లో సిరీస్ లోనూ రెండు సెంచరీలు బాదిన బెయిర్ స్టో... వరుసగా మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. 

ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 50 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు కాగా, టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు (416)కు ఇంకా 181 పరుగులు వెనుకబడి ఉంది. బెయిర్ స్టో (102 బ్యాటింగ్)కు జతగా క్రీజులో శామ్ బిల్లింగ్స్ 23 పరుగులతో ఆడుతున్నాడు.

Jonny Bairstow
Ton
Century
England
Team India
Birmingham
  • Loading...

More Telugu News