Amit Shah: మరో 30-40 ఏళ్లు బీజేపీ హవానే కొనసాగుతుంది: హైదరాబాదులో అమిత్ షా

Amit Shah comments on politics

  • హైదరాబాదులో బీజేపీ జాతీయ సమావేశాలు
  • రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన అమిత్ షా
  • దేశ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యంలేదని విమర్శలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొన్న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే 30-40 ఏళ్లు బీజేపీ శకం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ మిగతా దేశాలకు దారిచూపే 'విశ్వ గురువు'గా ఎదుగుతుందని అన్నారు. అయితే, కుటుంబ పాలనలు, కుల రాజకీయాలు, వెన్నెముకలేని రాజకీయాల వంటివి దేశానికి పట్టిన దరిద్రాలు అని వివరించారు. ఏళ్ల తరబడి దేశ దుస్థితికి ఇవే కారణమని అభిప్రాయపడ్డారు. 

ఇప్పుడు, విపక్షాల్లో ఐక్యత లేదని, కాంగ్రెస్ పార్టీ నేతలు తమ సొంత పార్టీలోనే అంతర్గత ప్రజాసామ్యం కోసం కుమ్ములాడుకుంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓ కుటుంబ పార్టీగా మారిపోయిందని, ఓడిపోతామన్న భయంతో ఆ కుటుంబం కనీసం పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు కూడా జరుపుకోవవడంలేదని ఎద్దేవా చేశారు.

Amit Shah
Politics
BJP
Hyderabad
  • Loading...

More Telugu News