Nagachaitanya: రాశి ఖన్నాను ఇక 'థ్యాంక్యూ' ఆదుకోవలసిందే!

Pakka Commercial Movie Update

  • తెలుగులో హిట్ కోసం రాశి ఖన్నా వెయిటింగ్ 
  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'పక్కా కమర్షియల్'
  • కామెడీ పరంగా మార్కులు కొట్టేసిన రాశి ఖన్నా 
  • కథాకథనాల పరంగా మెప్పించలేకపోయిన కంటెంట్
  • 'ఈ నెల 22వ తేదీన విడుదల కానున్న 'థ్యాంక్యూ' 

మొదటి నుంచి కూడా రాశి ఖన్నా తన కెరియర్ విషయంలో అంతగా దూకుడు చూపించలేదు. వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్లిందే తప్ప, చక చకా అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేసినట్టుగా కనిపించలేదు. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో రాశి ఖన్నా చేసిన పాత్ర ఆమెకి విమర్శలను తెచ్చిపెట్టింది.

ఆ తరువాత ఆమె ఎక్కువగా తమిళ సినిమాలపైనే ఫోకస్ చేస్తూ వెళ్లింది. కొంత గ్యాప్ తరువాత ఆమె మళ్లీ 'పక్కా కమర్షియల్' చేసింది. మారుతి దర్శకత్వంలో గోపీచంద్ జోడీగా ఆమె చేసిన ఈ సినిమా, నిన్ననే థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో టీవీ సీరియల్ ఆర్టిస్టుగా రాశి ఖన్నా సందడి చేసింది. కామెడీ చేయడంలో ఆమె చాలా ఈజ్ చూపించింది. 

నటన పరంగా .. గ్లామర్ పరంగా రాశి ఖన్నాకు వంకబెట్టవలసిన పనిలేదు. కానీ ఆశించిన స్థాయి సక్సెస్ లు మాత్రం పడటం లేదు. ఇక తన ఆశలన్నీ ఆమె ' థ్యాంక్యూ' సినిమాపై పెట్టుకోవాలసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నాయికగా ఆమె చేసిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ముగ్గురు హీరోయిన్లలో ఆమె ఒకరు. ఆమె పాత్రకి ఏ మేరకు ప్రాధాన్యత దక్కుతుందనేది చూడాలి మరి. 

Nagachaitanya
Rashi Khanna
Thank You Movie
  • Loading...

More Telugu News