badminton: సంచలన విజయం సాధించిన భారత షట్లర్ ప్రణయ్

HS Prannoy registers sensational victory in Malaysia open

  • నాలుగో ర్యాంకర్ కు షాకిచ్చిన భారత  ఆటగాడు
  • మలేసియా ఓపెన్ లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న ప్రణయ్
  • పీవీ సింధు కూడా ముందంజ

ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ మరోసారి సంచలన ప్రదర్శన చేశాడు. తన కంటే ఎంతో మెరుగైన, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ను ఓడిస్తూ మలేసియా ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. మరోవైపు డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ఇదే టోర్నమెంట్ లో అతి కష్టం మీద ప్రీక్వార్టర్స్‌ అధిగమించింది. 

పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో అన్ సీడెడ్ ఆటగాడైన ప్రణయ్‌ 21-15, 21-7తో నాలుగో ర్యాంకర్ చో టిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ను వరుస గేముల్లో చిత్తు చేసి ఔరా అనిపించాడు. క్వార్టర్ ఫైనల్లో అతను ఏడోసీడ్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సింధు 9-21, 21-9, 21-14తో చైవాన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. దాదాపు గంట పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ కోల్పోయిన సింధు.. ఆ తర్వాత వరుస గేమ్‌లు నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

badminton
hs prannoy
PV Sindhu
  • Loading...

More Telugu News