Andhra Pradesh: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మరోసారి నెంబర్ వన్

Andhra Pradesh tops the chart of ease of doing business

  • జాతీయస్థాయిలో సత్తా చాటిన ఏపీ
  • టాప్ అచీవర్స్ విభాగంలో ఏపీనే టాప్
  • ఇదే జాబితాలో తెలంగాణ, తమిళనాడు
  • గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్ లకు చోటు

పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అనుకూల విధానాలు కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి అగ్రస్థానం అందుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మళ్లీ నెంబర్ వన్ గా నిలిచింది. ఈ జాబితాలో ఏపీ తర్వాత స్థానాల్లో గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు నిలిచాయి. ఈ మేరకు ఏపీ టాప్ అచీవర్స్ విభాగంలో తన సత్తా చాటింది. 

అటు, అచీవర్స్ విభాగంలో హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలవగా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఆ తర్వాత స్థానాలలో ఉన్నాయి. ఆశావహ రాష్ట్రాల జాబితాలో అసోం, చత్తీస్ గఢ్, గోవా, ఝార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ చోటు దక్కించుకున్నాయి.

ఔత్సాహిక వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితాలో అండమాన్ అండ్ నికోబార్, బీహార్, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యు, ఢిల్లీ, జమ్ము కశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాలండ్, పుదుచ్చేరి, త్రిపుర ఉన్నాయి.

Andhra Pradesh
Ease Of Doing Business
Number One
Top Achievers
YSRCP
  • Loading...

More Telugu News