Botsa Satyanarayana: ఎల్లకాలం నేనే నాయకుడిని అనుకోవడం మంచిది కాదు: బొత్స సత్యనారాయణ

Talking about TDP is waste says Botsa Satyanarayana
  • అదృష్ణం ఉంటే ఎవరైనా నాయకుడు కావచ్చన్న బొత్స 
  • టీడీపీ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అని కామెంట్ 
  • 1998 డీఎస్సీ ఉద్యోగులకు మళ్లీ ట్రైనింగ్ ఇస్తామన్న మంత్రి 
తన చీపురుపల్లి నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి పార్టీకి మంచివి కాదని చెప్పారు. ఎల్లకాలం నేనే నాయకుడిని అనుకోవడం మంచిది కాదని అన్నారు. అదృష్టం ఉంటే ఎవరైనా నాయకుడు కావచ్చని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలు అడగొద్దని అన్నారు. చీపురుపల్లిలో ఈరోజు జరిగిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున గురించి మాట్లాడుతూ, వయసులో చిన్నవాడివి అవగాహన లేకుండా మాట్లాడొద్దని బొత్స సూచించారు. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి మీ అమ్మగారు ఏం చేశారో చెప్పాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అని చెప్పారు. 1998 డీఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నానని... వారి వయసులు పెరిగిపోయాయని అన్నారు. ఈ వయసులో విద్యార్థులకు వారు ఏం బోధిస్తారు? అందుకే వారికి ఇప్పుడు మళ్లీ ట్రైనింగ్ ఇస్తాం అని చెప్పారు.
Botsa Satyanarayana
YSRCP
Telugudesam

More Telugu News