Kodali Nani: సీనియర్ ఎన్టీఆర్ కు వారసుడు జూనియర్ ఎన్టీఆరే: కొడాలి నాని

Kodali Nani comments on Junior NTR

  • వారసత్వం అంటే తాత, తండ్రి, కొడుకు
  • వారసత్వం అంటే మామ, అల్లుడు కాదు
  • చంద్రబాబు, కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించండి

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మచిలీపట్నంలో వారసుడినే గెలిపించాలని... ఇల్లరికం వచ్చిన కొల్లు రవీంద్ర (టీడీపీ)ని కాదని చెప్పారు. వైసీపీ తరపున మాజీ మంత్రి పేర్ని నాని నిలబడినా, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా గెలిపించాలని అన్నారు. 

వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని... మామ, అల్లుడు కాదని అన్నారు. వారసత్వం అంటే వైయస్సార్, వైయస్ జగన్ అని... సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని అన్నారు. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలని ప్రజలను కోరారు. మచిలీపట్నంలో ఈరోజు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Kodali Nani
Perni Nani
Jagan
YSRCP
Chandrababu
Kollu Ravindra
Telugudesam
  • Loading...

More Telugu News