Gopichand: ఈ ముగ్గురికీ 'పక్కా కమర్షియల్' హిట్ చాలా కీలకమే!

Pakka Commercial Movie Update

  • యాక్షన్ కామెడీతో రూపొందిన 'పక్కా కమర్షియల్'
  • డిఫరెంట్ గా డిజైన్ చేసిన పాత్రలో గోపీచంద్ 
  • మారుతి దర్శకత్వంలో మరోసారి రాశి ఖన్నా 
  • జులై 1వ తేదీన సినిమా విడుదల  

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన 'పక్కా కమర్షియల్' జులై 1వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. దర్శకుడిగా మారుతికి 'ప్రతి రోజూ పండగే' సినిమా తరువాత హిట్ లేదు. కరెక్టుగా చెప్పాలంటే 'మహానుభావుడు' తరువాత ఆయన నుంచి సరైన హిట్ రాలేదు.

ఇక రాశి ఖన్నా గ్లామర్ కు గానీ .. ఆమె నటనకు గానీ వంకబెట్టలేం. కానీ 'ప్రతి రోజూ పండగే' తరువాత ఆమె చేసిన సినిమాలు కూడా అంతగా ఆదరణ పొందలేకపోయాయి. దాంతో ఆమె కూడా కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇక గోపీచంద్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. 

అరడజను ఫ్లాపులను చవిచూసిన గోపీచంద్, ఈ సినిమాపైనే ఆశపెట్టుకున్నాడు. దర్శకుడిగా మారుతి .. నిర్మాతగా బన్నీ వాసు కథల విషయంలో తీసుకునే నిర్ణయాలపై ఆయన నమ్మకం పెట్టుకున్నాడు. తమ కెరియర్లో కీలకమైన ఈ సక్సెస్ కోసం ముగ్గురూ వెయిట్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Gopichand
Rashi Khanna
Pakka Commercial Movie
  • Loading...

More Telugu News